రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అల్లేని నిఖిల్ విమర్శించారు.ఆయన మాట్లాడుతూ అసలే ఐదు సంవత్సరాలు కరువుతో అల్లాడిపోయిన రైతులపై దేవుడు కనికరించి ఈ ఒక్క సంవత్సరం పంటలు బాగా పండితే….. అది అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు.మరికొందరు రైతులు ఏమి చెయ్యాలో అర్ధంకాని పరిస్థితులలో కష్టపడి పండించిన పంట అంతా కొందరు దళారుల చేతుల్లో పెట్టాల్సి వస్తుంది.అన్నం పెట్టే దేవుడు,మా పంట కొనండి సారూ అని ఒక అధికారి కాళ్ళ మీద పడి కన్నీళ్ళు కార్చడం అత్యంత సిగ్గుపడాల్సిన విషయం.కానీ ఏదో ఒకరోజు వారి కన్నీళ్ళ ప్రవాహంలో ఈ అవకాశవాద రాజకీయ నాయకులు ఖచ్చితంగా కొట్టుకుపోతారు.అలాంటి రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని అన్నారు.
Advertisements