రిజర్వేషన్లు పరిష్కారం కాదు, పరిహారం మాత్రమే : అల్లేని నిఖిల్

రిజర్వేషన్లు పరిష్కారం కాదు, పరిహారం మాత్రమే అని అల్లేని నిఖిల్ అన్నారు.హైదరాబాద్ హిమాయత్ నగర్ లో రిజర్వేషన్లపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో కులాల కుంపటి పెట్టి సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయవద్దని అన్నారు.స్వాతంత్ర్యం వచ్చి ఏడు(7) దశాబ్దాలు గడుస్తున్నా అణగారిన వర్గాల వారి స్థితిగతులు పెద్దగా మారింది లేదని, ముఖ్యంగా కొన్ని కులాల వారు, ఆదివాసీలు ఈనాటికీ వారికి లభించిన కోటాను సంపూర్ణంగా వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.

రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి రెండు శాశ్వత పరిష్కార ప్రతిపాదనలు చేస్తున్నానని నిఖిల్ అన్నారు.

  1. అణగారిన వర్గాల్లోని పేద పిల్లలకు ఎంపిక పరీక్షలలో అదనంగా కొంతవరకు మార్కులు కలపాలి.ఈ మార్కుల వెయిటేజీకి ఆ పిల్లలు చదివే స్కూల్, తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత, విద్యార్హత వంటివి పరిగణలోకి తీసుకోవచ్చు.
  2. అణగారిన వర్గాల పిల్లలు ప్రభుత్వ/ ప్రైవేట్/ కార్పొరేట్ వంటి తేడా లేకుండా ఎవరు ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నా, ఉచితంగా విద్యనందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని, ఎంత ఉన్నత విద్యాకైనా పూర్తి తోడ్పాటును అందించాలి.

ఈ రెండు పరిష్కార మార్గాలను అణగారిన వర్గాలతో పాటు, అగ్రకులాలలోని పేదవారికి కూడా వర్తింపజేస్తే రానున్న కొన్ని సంవత్సరాల తరువాత రిజర్వేషన్ల అవసరం ఉండదని నిఖిల్ అన్నారు.

దీనికోసం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను ప్రక్కనపెట్టి ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన సూచించారు.ఈ ప్రతిపాదనల్లో అవసరమయితే కొన్ని మార్పులు చేయవచ్చని, కానీ ఒక ప్రత్యామ్నాయ పరిష్కారంతో కూడిన రిజర్వేషన్ల సంస్కరణలను అమలు చేయడం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరమని నిఖిల్ అన్నారు.వీటికి రాజ్యాంగ సవరణ వంటి సంక్లిష్ట ప్రక్రియలు కూడా అవసరం లేదన్నారు.

  • వీటితో పాటు రిజర్వేషన్ల కులాలలో కూడా నిజమైన అర్హులకు అవకాశాలు అందించేందుకు మరొక సంస్కరణ చెప్పట్టాలని ఆయన సూచించారు.క్రిమిలయేర్ ను అమలు చేసి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు,IAS,IPS లు, డాక్టర్లు మరియు సంపన్న వర్గాలను రిజర్వేషన్ల పరిధి నుండి తప్పించాలని ఆయన అన్నారు. ఇలా చేస్తే రిజర్వేషన్లు పొందుతున్న కులాలలో అడుగున ఉన్న లక్షలాది మంది అర్హులు అవకాశాల్ని అందుకోవడంతో పాటుగా క్రమంగా రిజర్వేషన్ల అవసరం లేకుండానే పేదరికం నుండి బయటపడగలుగుతారని నిఖిల్ అన్నారు.
  • కాబట్టి ప్రభుత్వం ఈ సంస్కరణలపై అందరిని కలుపుకొని చర్చించి అమలు చేయాలని కోరారు. వీటిని అమలు చేయడం వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, మరియు దేశమంతటికీ రిజర్వేషన్ల సంస్కరణలపై దారి చూపేందుకు ఇది గొప్ప అవకాశమని, తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప ఆదర్శప్రాయమైన నమూనాను దేశానికి అందించినట్లు అవుతుందని నిఖిల్ అన్నారు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s